సిరివెలుగు, సిరిసిల్ల: సిరిసిల్లలోని ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులపై సస్పెన్షన్ వేటు అధిష్టానం ఎత్తివేసింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గోనె శరణ్య, బూర యాదగిరి, నల్ల శ్రావణ్ లు కౌన్సిలర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. సుమారు ఆరు నెలల పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారని, ఈ ముగ్గురిని అధిష్టానం ఆదేశాల మేరకు డిసిసి జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు డిసిసి జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ప్రకటించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో యధావిధిగా పాల్గొనవచ్చని, పార్టీ క్రమశిక్షణకు లోబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.











