సీఎం వస్తుండు..! భూములు లాక్కుంటాం..? కాంగ్రెస్ నేత వాక్యాలపై జిల్లెల్ల రైతుల ఆవేదన

భూముల పట్టాల పునరుద్ధరణకు రైతుల ఆందోళన. జిల్లెల్లలో ప్రధాన రహదారిపై బైఠాయింపు. తమ భూములు లాక్కోవద్దంటూ నిరసన. సిరివెలుగు, సిరిసిల్ల : సీఎం వస్తుండు.. భూములు లాక్కుంటాం.. కాంగ్రెస్ నేత వాక్యాలు చేస్తున్నాడని మండలంలోని జిల్లెల్ల గ్రామ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని, రైతుబంధు, ఎరువులు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ జిలెల్ల గ్రామానికి చెందిన దళిత రైతులు బుధవారం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ…

భూముల పట్టాల పునరుద్ధరణకు రైతుల ఆందోళన.

జిల్లెల్లలో ప్రధాన రహదారిపై బైఠాయింపు.

తమ భూములు లాక్కోవద్దంటూ నిరసన.

సిరివెలుగు, సిరిసిల్ల : సీఎం వస్తుండు.. భూములు లాక్కుంటాం.. కాంగ్రెస్ నేత వాక్యాలు చేస్తున్నాడని మండలంలోని జిల్లెల్ల గ్రామ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని, రైతుబంధు, ఎరువులు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ జిలెల్ల గ్రామానికి చెందిన దళిత రైతులు బుధవారం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా బాధిత రైతులు మాట్లాడుతూ తమ భూములకు సంబంధించిన పట్టాలను వెంటనే పునరుద్ధరించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తమకు భూములు కేటాయించారని, అప్పట్లో రైతుబంధు కూడా అందిందని తెలిపారు. ప్రస్తుతం అదే భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని, దీంతో రైతుబంధు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో భూముల వివరాలు లేకపోవడంతో యూరియా వంటి ఎరువులు పొందడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. ‘‘సీఎం వస్తున్నారు.. మీ భూములు గుంజుకుంటాం’’ అంటూ ఓ కాంగ్రెస్‌ నాయకుడు బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విభేదాలు ఉంటే నాయకులు పరస్పరం చూసుకోవాలని, పేద దళిత రైతుల భూముల విషయంలో రాజకీయాలు చేయొద్దని కోరారు.అధికారులను అడ్డుపెట్టుకుని తమ పట్టాలను రద్దు చేయించే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆరోపించారు. ‘‘భూమి మాది.. సాగు మాది.. మరి మా భూముల వివరాలు ఆన్‌లైన్‌లో ఎందుకు లేవు?’’ అంటూ ప్రశ్నించారు. తమ భూములకు సంబంధించిన పట్టాలను వెంటనే పునరుద్ధరించి, ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు. తమ భూముల విషయంలో అధికారులు సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!